అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు అందెల శ్రీరాములు కబ్జాకు గురైతున్న భూములను పరిశీలించిన సిపిఐ బృందం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి గ్రామంలో అసైన్డ్ భూమిని కబ్జా చేసి ఇదేచగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు అందెల శ్రీరాములు వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బృందం కబ్జాకు గురవుతున్న భూమిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల యాదిరెడ్డి మరియు సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కావలి నరసింహ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆగపల్లి గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 187 మరియు 191 లో గల భూమిలో ఎస్సార్ గ్రూపు శ్రీ సిటీ పేరుతో అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ని ఏర్పాటు చేసి ఈ భూమిని కబ్జా చేసి వారు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్న భూమిలో కలుపుకొని అక్కడ ఉన్న స్మశాన వాటిక మరియు చాకలికుంట భూమిని కబ్జా చేయడం జరిగిందని అన్నారు పక్కనే ఉన్న ఫారెస్ట్ భూమిలో నుండి మట్టి తీసుకొచ్చి ఎస్సార్ గ్రూప్ శ్రీ సిటీలో వెంచర్ అభివృద్ధి పనులు చేస్తున్నారని దీనిలో ఫారెస్ట్ అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారని విమర్శించారు అనేకసార్లు రెవెన్యూ యంత్రాంగానికి వినతి పత్రాలు ఇచ్చిన వారు కనీసం సర్వే చేయడం లేదని అన్నారు ఈ అవినీతి కుంభకోణంలో రెవెన్యూ పోలీసు ఫారెస్ట్ అధికారులు భాగస్వాములై పేద బడుగు బలహీన వర్గాల పుట్టగొడుతున్నారని విమర్శించారు స్థానిక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఈ విషయంపై స్పందించకపోవడం అనుమానానికి తావిస్తుందని అన్నారు ఇక్కడ బిజెపి, టిఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై అసైన్డ్ భూమిని కొల్లగొడుతున్నారని విమర్శించారు రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి అసైన్డ్ భూమిని సర్వే చేసి దానిని భూ బకాసుల నుండి కాపాడాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి పేద ప్రజలకు భూమిని పంచుతామని డిమాండ్ చేశారు ఎస్ ఆర్ గ్రూప్ సంస్థ అధినేత అందేలా శ్రీరాములు మహేశ్వరం నియోజకవర్గంలో నేనొక బహుజన నాయకున్ని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని నన్ను గెలిపించాలని చెప్పి మాట్లాడుతున్నారని ఆయన చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి దొమ్మరి గుడిసెలని తీవ్రస్థాయిలో విమర్శించారు ఈ విషయం పైన బిజెపి రాష్ట్ర నాయకత్వం స్పందించి అందెల శ్రీరాములు పైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు నీలమ్మ సిపిఐ సీనియర్ నాయకులు జంగిలి కృష్ణ నర్ల శ్రీశైలం రాజు నాయక్ మంగళపల్లి సురేందర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
Comments