సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజేందర్ (29) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి కూడా నిశ్చయం అయ్యింది. పెళ్లి కార్డులు బంధువులకు పంచుతూ ఈనెల 3వ తారీఖున ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజేందర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. నిన్న పెళ్లి జరగాల్సిన రోజే లింగంపేట మండలం ఎల్లారం గేటు సమీపంలో చెట్టుకు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్న రాజేందర్ మృతదేహం బంధువులకు లభ్యం అయ్యింది. దీంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న లింగంపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పెళ్లి జరగాల్సిన రోజే ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సదాశివనగర్ మండలం అడ్డూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి29 అనే యువకునికి రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో ఈ నెల ఏడవ తారీఖున పెళ్లి నిశ్చయమైంది. ఈనెల మూడవ తారీఖున బంధువులకు పెళ్లి పత్రికలు పంచి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన రాజేందర్ రెడ్డి తిరిగి ఇంటికి రాకపోవడంతో స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.
నిన్న సాయంత్రం రాజేందర్ రెడ్డి లింగంపేట మండలం ఎల్లారం గేటు సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకున్న మృతదేహం లభ్యమైంది . దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దింపారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో సంఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకొని కన్నీరు మున్నీరు గా విలపించారు. పెళ్లి జరగాల్సిన రోజే మృతి చెందడం పట్ల కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఆత్మహత్యకు గత కారణాలు ఇంకా తెలియ రాలేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట పోలీసులు తెలిపారు.
Comments