మరో అంతరిక్ష అద్భుతానికి నాంది పడింది. సూర్యుడిపై రహస్యాలను చేధించేందుకు చేపట్టిన ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతగా మొదలైంది. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. నెలల పాటు ప్రయాణించి ఎల్1 కక్ష్యలోకి ప్రవేశించనుంది. సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ప్రయోగాలు చేయనుంది. ఎలాంటి అవంతరాలు లేకుండా రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళుతుంది...సూర్యుడిపై ఉన్న రహస్యాలను చేధించడమే లక్ష్యంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్సేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్వి సీ 57 రాకెట్ విజయవంతంగా నింగిలోకి వెళ్లింది. ఆదిత్య ఎల్1ను నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ తీసుకెళ్లింది. సూర్యుడిపై పరిశోధనలు నిర్వహించేందకుగాను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరించనున్నారు. అక్కడి నుంచి సూర్యుడి ఉపతలంపై ప్రయోగాలు చేయనుంది.శుక్రవారం మధ్యాహ్నం 11.10 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ఈ రోజు ఉదయం 11.50 గంటల వరకు కొనసాగింది. ఆదిత్య ఎల్1 ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో జరగనుంది. ఆదిత్య ఎల్1 ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో జరగనుంది. మొదటి దశలో 20 మీటర్ల పొడవు, 2.8 మీటర్ల వ్యాసార్థం కలిగిన రాకెట్‌లో 138 టన్నుల ఘన ఇంధనం నింపారు. దీని చుట్టూ ఆరు స్ట్రాఫాన్ బూస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిలో 12 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. ఇవన్నీ కలిపి భారీ రాకెట్‌ను అంతరిక్షంలోకి మోసుకువెళ్తాయి.

Comments